Headlines

జగన్ పూర్తి చేసిన పనులకు చంద్రబాబు రిబ్బన్ కటింగ్.. ధర్మాన కామెంట్స్..


వైసీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు.. చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వంపై విరక్తి వచ్చిందని, ఆయనకు పాలనపై కంట్రోల్ లేదని ధర్మాన ఆరోపించారు. విశాఖపట్నంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇది చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారని, ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గణనీయమైన సేవలు అందించారని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీ, భావనపాడు పోర్టు వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి జగన్ కృషి చేశారని ధర్మాన స్పష్టం చేశారు. వంశధార, తోటపల్లి, జంఝావతి వంటి ప్రాజెక్టులను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 20 సంవత్సరాలలో పూర్తి చేయలేకపోయారని ధర్మాన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి, దాని లోపభూయిష్టమైన డిజైన్‌కు చంద్రబాబు చేసిన పొరపాట్లే కారణమని ఆయన ఆరోపించారు.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపైనా ధర్మాన మాట్లాడుతూ.. కేంద్రం ప్రైవేటీకరణ విధానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని ప్రశ్నించలేకపోతోందని పేర్కొన్నారు. కేవలం అప్పులు తీర్చడానికి నిధులు సమకూరుస్తున్నారని, ఇది ప్రైవేట్ ఇన్వెస్టర్లకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *