Headlines

గోదావరి ఉద్ధృతిలో చిక్కుకున్న 185 మంది కూలీలు.. రైతు సాహసంతో అందరూ సేఫ్!


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి లంకలో మిరప మొక్కలు నాటేందుకు వెళ్లిన సుమారు 185 మంది వ్యవసాయ కూలీలు గోదావరి వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. గోదావరి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో లంక ప్రాంతంలోని మిరప తోటల్లో పనిచేస్తున్న కూలీలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ఉద్ధృతి మరింత పెరుగుతుండటంతో కూలీలు ఆందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న ఓ రైతు వెంటనే పడవ సహాయంతో లంక ప్రాంతానికి చేరుకుని, అక్కడ చిక్కుకున్న కూలీలను ఒక్కొక్కరిని పడవలోకి ఎక్కించి సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలను ఏర్పాటు చేసి లంకలో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా సురక్షితంగా ఒడ్డుకు తరలించారు.

అధికారుల సమన్వయంతో సుమారు 185 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో లంక ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *