Shukra Graha Sancharam: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ, అందం, సౌకర్యాలు, విలాసం, ఆర్థిక పరిస్థితి, సంబంధాలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ అంశాలకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం శుక్రుడు తన స్వరాశి అయిన తులారాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 6, 2026 వరకు శుక్రుడు తులారాశిలోనే కొనసాగనున్న నేపథ్యంలో, రాబోయే రోజులు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉండవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కన్య, తుల, కుంభ, మకర, ధనుస్సు రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.