Headlines

Andhra Pradesh: ఏపీలో పింఛన్లపై బిగ్ అప్టేట్.. ఈ సారి ఆలస్యంగా పంపిణీ.. ప్రభుత్వం నుంచి ప్రకటన..


Andhra Pradesh: ఏపీలో పింఛన్లపై బిగ్ అప్టేట్.. ఈ సారి ఆలస్యంగా పంపిణీ.. ప్రభుత్వం నుంచి ప్రకటన..

ఏపీలో పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ నెలా ఒకటో తేదీన ఉదయం నుంచే పించన్లను లబ్దిదారులకు అందిస్తున్నాయి. అయితే ఈ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇచ్చే సామాజిక పించన్లను ఒకటో తేదీ మధ్యాహ్నం ఇవ్వనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం నుంచి పించన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరుసగా బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలకు అంతరాయం కలగనుంది. ఈ కారణంతో పించన్ల పంపిణీలో సమస్యలు తలెత్తాయి.

సచివాలయ ఉద్యోగులు బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసి లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. ఒకటో తేదీ పించన్ అందించాలంటే ముందు రోజే వెళ్లి విత్ డ్రా చేసుకుని పంపిణీకి సిద్దంగా ఉంచుతారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంక్ సేవలక అంతరాయం కలిగే అవకాశం ఉన్నందువల్ల అక్టోబర్ 1న ఉదయం అధికారులు బ్యాంకులు వెళ్లి విత్ డ్రా చేస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. పించన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పా్ట్లు చేసుకోవాలని సచివాలయ అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే నెలలో 61.80 లక్షల మందికి పించన్లను అందించనుండగా.. ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692 కోట్లు విడుదల చేసింది.

అయితే అక్టోబర్ నుంచి పించన్ల పంపిణీలో కొత్త విధానం అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చేతికి అందనుండగా.. కేంద్ర వాటా రూ.200 లేదా రూ.300 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ విధానాన్ని ముందుగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నారు. రాష్ట్రంలో 62 లక్షల మంది పించన్లు పొందుతుడగా.. వీరిలో 9.34 లాక్షల మంది ఎన్‌ఎస్‌ఏపీలో అనుసంధానమై ఉన్నారు. అయితే కొంతమంది లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్‌లో లేకపోవడంతో పించన్లను అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. దీంతో పించన్లు పొందే లబ్దిదారులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి. అలాగే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసి ఉండాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *