Headlines

48 గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే జంతర్ మంతర్ 2.0వో స్టార్ట్ చేస్తాం: అభిజీత్ దిప్కే


SIR వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఇదే వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లోగా ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేయకపోతే, దేశవ్యాప్త నిరసనలు చేపడతామని, జంతర్-మంతర్ 2.0 జరగడం ఖాయమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యానికి జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద ముప్పని.. జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుండి, ఎవరు ఓటు వేయాలో, ఎవరు వేయకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తోందని ఆరోపించారు. అంతేకాదు.. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏకంగా 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని.. ఇది మొత్తం ఓట్లలో సుమారు 13శాతం నుండి 14శాతం మేర తీసేయడమే అన్నారు.

వారు ఎప్పటికీ అధికారం కోల్పోకుండా ఉండేందుకు, ఆ 2శాతం ఆధిక్యాన్ని పెంచేందుకే జ్ఞానేష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ఇన్ని ఓట్లను తొలగించారని ఆయన ఆరోపించారు. ఇది ఎందుకు చేస్తున్నారు? ఇన్ని ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?ని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడంలో విఫలమైనప్పుడు వారిలో భయం మొదలైందని, దేశ ప్రజల మూడ్ మారుతోందని, ప్రాంతీయ శక్తులు బలంగా ఎదుగుతున్నాయని గ్రహించే ఈ కుట్రకు తెరతీశారని విమర్శించారు.

ప్రతిపక్షాలను అంతం చేసేందుకే..
ఇది కేవలం యాదృచ్ఛికం కాదని, బలమైన ప్రతిపక్ష నేతలను అంతం చేసేందుకు పన్నిన స్పష్టమైన కుట్ర అని దిప్కే ఆరోపించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే మొదలుకుని, స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి ఓడించారని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లను తొలగించగా, ఆమె దాదాపు 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని ఆయన వివరించారు. అలాగే తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ నియోజకవర్గంలో లక్ష ఓట్లను తొలగించడంతో ఆయన సుమారు 45,000 ఓట్ల తేడాతో, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గం నుంచి 40 వేలకు పైగా ఓట్లు తొలగించగా ఆయన 4,000-5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. కేరళలో పినరయి విజయన్ తిరిగి ముఖ్యమంత్రి కాలేకపోవడానికి కూడా ఈ ఓట్ల తొలగింపే కారణమని ఆయన ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా అంతం చేస్తే, అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని దీప్కే ప్రశ్నించారు. దాన్ని ప్రజాస్వామ్యం అని పిలవగలరా? ఇది స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రకియ ఎలా అవుతుందా? అని దిప్కే ప్రశ్నించారు. మొత్తంగా సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *