Headlines

పరగడుపున తులసి నీరు తాగితే ఆ సమస్యలన్నీ హాంఫట్.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!


ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి శీతాకాలపు ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తాయి. అలాగే, శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తూ, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో తులసి నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పరగడుపున తులసి నీరు తాగితే కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఒత్తిడి నుండి ఉపశమనం:

తులసి ఒక సహజమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో మానసిక ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే తులసి నీరు తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

తులసిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సీజనల్ జ్వరం, శీతాకాలపు ఇన్ఫెక్ష, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి



జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

తులసి నీరు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కడుపునొప్పి, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు:

తులసిలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు ఊపిరితిత్తులలోని కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఆస్తమా, బ్రోంకైటిస్, గొంతు నొప్పితో బాధపడేవారికి తులసి నీరు అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్:

తులసిలో ఉండే ఫైటోకెమికల్స్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

తులసి నీటిని తయారు చేయడం చాలా సులభం. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా తాగితే సరిపోతుంది. సహజసిద్ధమైన ఈ పానీయాన్ని రోజువారీ దినచర్యలో భాగం చేసుకుని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *