చాలా మంది అమ్మాయిలకు జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఉంది. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందిని వేధిస్తుంది.
అసలు ఇది పోషకాహార లోపం, ఒత్తిడి వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కాలతోనే దీనిని తగ్గించుకోవచ్చు. ఇది పాటిస్తే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఈ పాతకాలం చిట్కాతో మీ జుట్టు ఒత్తుగా, బలంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే, నేటి కాలంలో 10 ఏళ్ళ వయస్సు ఉన్న అమ్మాయిల నుంచే ఈ జుట్టు రాలుతుంది. దీనిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా ఇలా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
జుట్టు రాలడం మొదలైన రోజు నుంచి ఇది ఫాలో అయితే చాలు. అయితే, దీని కోసం ఒక గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి దానిలో కొద్దిగా టీ పొడి వేసి మరిగించి దానిని డికాషన్ లాగా వడగొట్టాలి. ఈ టీ డికాషన్ జుట్టుకు వాడితే మీ సమస్య తగ్గుతుంది.
మరిగిన ఈ టీ డికాషన్ ని మీరు ఒక చిన్న గిన్నెలోకి వడకట్టి దానిలో షాంపూను కూడా కలపాలి.
కొద్దీ సేపటి తరవాత దీనిలో కొంచం నిమ్మరసం కూడా కలపాలి. ఈ నిమ్మలో ఉండే గుణాలు తలలో వచ్చే చుండ్రు సమస్య ను కూడా తగ్గిస్తుంది. ఇంకా మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉండేలా ఇది చేస్తుంది. అంతే కాదు తలలో ఉన్న చుండ్రును ఆపి
జుట్టురాలే సమస్యకు కూడా తగ్గుతుంది. ఇలా రెండు సార్లు తల స్నానం చేయాలి.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




