మొత్తంగా టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు మూడే. వాటిలో ‘చిత్రలహరి’ మంచి విజయాన్ని అందుకోగా.. మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయాయి. సినిమాలు తక్కువగా చేసినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్‌కు తెలుగులో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందం, సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె సినిమాలు పెద్దగా కనిపించకపోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ బ్యూటీని మళ్లీ వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు.