భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి Honor నుంచి కొత్త మోడల్ రాబోతోంది. Honor X9e Proలో 11000mAh బ్యాటరీతో పాటు 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే, 108MP మెయిన్ కెమెరా ఉంటాయని సమాచారం. IP69K రక్షణ కూడా ఉండటంతో ఈ ఫోన్ ప్రత్యేకతలపై ఆసక్తి నెలకొంది.
రఫ్ డిజైన్..
లుక్ పరంగా ఈ ఫోన్ ప్రత్యేకంగా కనిపించేలా రూపొందించారు. Dawn Gold, Midnight Black, Reddish Brown, Royal Purple అనే నాలుగు రంగుల్లో ఇది రానుంది. కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. అదనంగా డ్రాప్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. దీంతో రోజువారీ వాడకంలో ఫోన్‌కు రక్షణ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు.
ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ 11000mAh భారీ బ్యాటరీ. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అత్యవసర సమయంలో ఇతర పరికరాలకు ఛార్జింగ్ అందించేందుకు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించేవారికి ఈ బ్యాటరీ ఉపయోగపడే అవకాశం ఉంది.
10,000 నిట్స్ డిస్‌ప్లే..
డిస్‌ప్లే విషయంలోనూ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఫీచర్ ఉంది. ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుందని సమాచారం. దీంతో ఎండలో స్క్రీన్‌ను మరింత స్పష్టంగా చూడొచ్చు. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108MP మెయిన్ కెమెరా అందించారు.
ప్రస్తుతం ఈ ఫోన్ మలేషియా మార్కెట్‌లో విడుదల కానుంది. భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం ఇంకా వెల్లడించలేదు. ప్రాసెసర్, మెమరీ వేరియంట్లు, ఖచ్చితమైన ధర వివరాలు సెప్టెంబర్ 24న జరిగే అధికారిక విడుదల కార్యక్రమంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, గట్టి నిర్మాణం, అధిక బ్రైట్‌నెస్ డిస్‌ప్లే, 108MP కెమెరా ఈ మోడల్‌లో ప్రధాన ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి.