టాటా మోటార్స్ సెడాన్ విభాగంలో కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Tata Aeris పేరుతో రానున్న ఈ కారు డిజైన్‌లో కొత్త మార్పులతో కనిపించనుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
కొత్త పేరుతో సెడాన్..
టిగోర్‌కు కొనసాగింపుగా కాకుండా కొత్త గుర్తింపుతో ఈ సెడాన్‌ను తీసుకురావాలని టాటా భావిస్తున్నట్లు సమాచారం. మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి కార్లకు పోటీగా దీనిని తీసుకురానుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పేటెంట్ డిజైన్ల ప్రకారం ముందు భాగంలో సన్నని గ్రిల్, కొత్త బంపర్, పెద్ద హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. సైడ్ ప్రొఫైల్‌లో నాచ్‌బ్యాక్ తరహా స్పోర్టీ రూపం కనిపించనుంది. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుకవైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్, AERIS బ్యాడ్జింగ్ ఉండనున్నాయి.
పెట్రోల్, CNG ఆప్షన్
ఇంటీరియర్‌లో క్లీన్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు రెండు ఫ్రీ స్టాండింగ్ స్క్రీన్లు ఉండొచ్చని సమాచారం. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ Android Auto, Apple CarPlay, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్‌తో CNG వెర్షన్ కూడా రావచ్చని సమాచారం. ధర విషయానికి వస్తే రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల ఎక్స్‌షోరూమ్ మధ్య ఉండొచ్చని అంచనా. అయితే ధర, ఇంజిన్, ఫీచర్లపై టాటా మోటార్స్ నుంచి అధికారిక వివరాలు వెల్లడైన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.