Headlines

డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రం నుంచి డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఫస్ట్ లుక్ అదిరిందిగా


యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. తాజాగా ఈ మూవీ నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రంలో డేవిడ్ థామస్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందని ఈ పోస్టర్‌ చూస్తేనే అర్ధం అవుతోంది.

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ఆయన క్యారెక్టర్ ఈ ప్రాజెక్ట్‌కు ఆసక్తికరంగాను హైలైట్ గా నిలుస్తుంది. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనేది అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే “డియర్ ఆస్ట్రోనాట్” చిత్రం. ఆ అసాధారణమైన కలను సాకారం చేసుకోవడానికి ఆమె సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతోన్నారు. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను ఇందులో గొప్పగా చిత్రీకరించారు.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

సినిమా షూటింగ్ పూర్తి అయింది. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇకపై ఈ సినిమాలోని ప్రతీ పాత్రను పరిచయం చేస్తూ ఇలా ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ని డేవిడ్ థామస్‌గా పరిచయం చేశారు. మున్ముందు ‘డియర్ ఆస్ట్రోనాట్’ ప్రపంచానికి సంబంధించిన మరిన్ని పాత్రలు, ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఆసక్తికరమైన అప్డేట్లు రానున్నాయి.’డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రానికి కార్తీక్ బి కొడకండ్ల సంగీతాన్ని అందించారు. అక్టోబర్‌లో ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

ఇవి కూడా చదవండి



బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *