Headlines

గ్లామర్‌ సీక్రెట్ రివీల్ చేసిన రష్మిక


టాలీవుడ్‌లో “చలో” సినిమాతో అడుగుపెట్టిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండను పెళ్లాడి తెలంగాణ కోడలిగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్‌తో కలిసి ముచ్చటగా మూడోసారి “రణబాలి” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా రష్మిక తన వ్యక్తిగత జీవితం, సినీ విశేషాలతో పాటు తన అద్భుతమైన గ్లామర్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. “రణబాలి” విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, రష్మిక తన వర్క్ లైఫ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రష్మిక యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మైసా” షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. “మైసా”లో ఆమె ఒక అండర్ వాటర్ యాక్షన్ సీన్‌లో నటించి, ఏషియాలోనే ఇలాంటి రిస్కీ అండర్ వాటర్ యాక్షన్ సీన్ చేసిన మొదటి మహిళా నటిగా రికార్డ్ సృష్టించారు.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *