Headlines

కామాంధుడి కాటుకు బలైన మైనర్ బాలిక.. తల్లి సహా ఇద్దరు అరెస్ట్..!


హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదమెక్కిన ఓ దుర్మార్గుడు తల్లితోపాటు కూతురును సైతం వదలలేదు. మేడిపల్లికి చెందిన మాలోత్ రవి మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన పోలీసులు వెల్లడించారు. రవి.. బాలిక తల్లి శారదతో సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై రవి లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి వెల్లడించారు.

ఈ ఘటన కారణంగా బాలిక గర్భం దాల్చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బాలికపై జరిగిన నేరానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె తల్లి శారదను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *