Headlines

కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్


ఐఫోన్ 18 ప్రో కొనడానికి గంటల తరబడి క్యూ కట్టిన ఐఫోన్ లవర్స్‌కు.. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. కొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ కొనడానికి ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల దగ్గర భారీగా జనం క్యూ కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన సోనూ సూద్.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. కానీ పాత బిల్లులే!” అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. కేవలం ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి క్యూ కట్టడం కాకుండా.. సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ఇలాగే క్యూ కడితే బాగుంటుందని అన్నారు. “నిజమైన అప్‌గ్రేడ్ అంటే.. మంచి సమాజాన్ని నిర్మించడమే” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. సోనూ సూద్ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఆయన చెప్పింది నిజమేనంటూ సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ డబ్బుతో ఏం కొనాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభమవుతుండగా.. హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ల ధరలు రూ.3 లక్షలు దాటుతున్నాయి. మొత్తానికి.. కొత్త ఫోన్ కంటే సమాజంలో మంచి మార్పే అసలైన అప్‌గ్రేడ్ అంటూ సోనూ సూద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dengue Vaccine: త్వరలో మార్కెట్ లోకి డెంగ్యూ నివారణకు వ్యాక్సిన్!

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!

ఏంట్రా ఇది.. అదేమైనా బస్సా.. విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..

రోబోల చేతికి కత్తెర? బార్బర్‌ ఉద్యోగాలూ గో..వింద!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *