ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ రాకా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దర్శకుడు అట్లీ, నిర్మాత కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సరికొత్త సాంకేతిక ప్రయోగంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సినిమా కోసం నిర్వహించిన భారీ మోషన్ క్యాప్చర్ లో ఒకేసారి చాలా మంది రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేసిన ఘనతను రాకా బృందం సాధించింది. మొత్తం 37 మంది పెర్ఫార్మర్లను ఒకే సమయంలో రియల్‌టైమ్‌లో క్యాప్చర్ చేయడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పింది. రాకా కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక మోషన్ క్యాప్చర్ సెషన్లో 4 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తి వరకు మొత్తం 37 మంది పాల్గొన్నారు. వీరందరి కదలికలు, పెర్ఫార్మెన్స్ను ఒకే క్యాప్చర్ వాల్యూమ్‌లో ఏకకాలంలో ఖచ్చితంగా రికార్డ్ చేయడం ఈ ప్రక్రియలో ప్రధాన సవాల్‌గా నిలిచింది.
బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే
ఇంత పెద్ద స్థాయిలో మోషన్ క్యాప్చర్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. సినిమా స్థాయి, అవసరాలకు అనుగుణంగా కొత్త మోషన్ క్యాప్చర్ పైప్‌లైన్, వర్క్‌ఫ్లోను డవలప్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ రికార్డు ప్రయత్నం కోసం ఏకంగా 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను ఉపయోగించారు. క్యాప్చర్, కాలిబ్రేషన్, నెట్వర్కింగ్, సింక్రనైజేషన్, రియల్‌టైమ్ అన్రియల్ విజువలైజేషన్, ఫేషియల్ క్యాప్చర్, విన్నెస్ కెమెరాలు వంటివి ఉపయోగించారు.
ఇవి కూడా చదవండి
ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య
ఈ భారీ టెక్నికల్ సెటప్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలువురు స్పెషలిస్ట్ టీమ్‌లు కలిసి పనిచేశాయి. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ను ప్రత్యేకంగా రికార్డ్ చేస్తూనే, మొత్తం 37 మంది ప్రదర్శనలను ఒకేసారి సమన్వయం చేయడం ఈ ప్రయత్నంలోని కీలక అంశంగా నిలిచింది. ఈ రికార్డు ప్రయత్నం 2026 ఫిబ్రవరిలో నిర్వహించబడింది. తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దీనిని పరిశీలించి, 2026 సెప్టెంబర్ 15న అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సీనియర్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డాంగ్రికర్ అధికారిక సర్టిఫికెట్‌ను రాకా హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సినిమా కీలక తారాగణం, సాంకేతిక బృంద సభ్యులు హాజరయ్యారు.
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్ వేసుకున్నారు: దేవి ప్రసాద్
A global triumph in motion capture! 🏆🌎#Raaka sets a Guinness World Record for the ‘Most People Motion-Captured in Real-Time’, with 37 performers captured simultaneously ✨@alluarjun @Atlee_dir @GWR#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords pic.twitter.com/hotAxnrgfE
— Sun Pictures (@sunpictures) September 21, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.