వీధి కుక్క విద్యార్థులను ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నేలా చేసింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోకు అడ్డు రావడంతో ఆ కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో బోల్తాపడి ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వద్ద జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి ఊహించని ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అకస్మాత్తుగా వీధికుక్క అడ్డురావడంతో ఆ కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది
ఈ ప్రమాదంలో జడ్పీహెచ్‌ఎస్ వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో బోల్తా పడిన ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని గాయపడిన విద్యార్థులను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ మిగతా విద్యార్థులకు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది.