కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి కనిపించింది. ఐఫోన్ 18 ప్రో విక్రయాలు శుక్రవారం భారత్‌లో ప్రారంభం అయ్యాయి. కొనుగోలుదారులు తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్లు ముందు క్యూ కట్టేసారు. నోయిడాలోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్ దగ్గర కూడా భారీ క్యూ కనిపించింది. అయితే అక్కడ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తన భార్యకి ఐఫోన్ 18 ప్రో కొనడం కోసం బంగారం అమ్మినట్లు చెప్పాడు. తన భార్యకు బర్గండీ రంగు ఐఫోన్ కావాలని చెప్పిందట. మరో విషయమేంటంటే.. ఆమె ఇప్పటివరకు ఐఫోన్ వాడలేదనిట. అందుకే తన భార్య కళ్లలో ఆనందం చూడ్డానికి కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నానని, అందుకే బంగారం అమ్మి మరీ ఫోన్ కొంటున్నానని చెప్పాడు. అయితే తను చేస్తున్న ఈ పనిని ఎంత చక్కగా సమర్థించుకున్నాడంటే…‘‘గతంలో డబ్బు లేదు.. ఇప్పుడు ఉంది… భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతం ఉన్న డబ్బుతో ఇప్పుడే జీవించాలి’’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అందుకే తన భార్య కోసం ఐఫోన్ కొనడానికి బంగారం విక్రయించినట్లు చెప్పాడు. మరో వ్యక్తి తన కాబోయే భార్యకు ఐఫోన్ కొనడానికి పంజాబ్‌నుంచి ఢిల్లీకి వచ్చాడు. పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ తన కాబోయే భార్యకు గిఫ్ట్‌గా ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేసేందుకు నోయిడాకు వచ్చాడు. తన కోసం ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కూడా కొనుగోలు చేశాడు. రెండు ఫోన్ల కోసం రూ.3.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఈ ఫోన్ల కోసం తెల్లవారుజాము నుంచే స్టోర్ ముందు క్యూలో నిల్చున్నాడు. కొంతమంది దంపతులు తమ కోసం రెండు ఐఫోన్ 18 ప్రో ఫోన్లు కొనుగోలు చేశారు. ధర పెరిగినా ఐఫోన్ అభిమానులు కొనుగోలు చేస్తారని ఓ మహిళ చెప్పింది. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఫోన్ కోసం క్యూ కట్టారు. కొందరు ఏకంగా సెలవు పెట్టుకుని వచ్చారు. అయితే ప్రీ-ఆర్డర్ చేయని వారికి ఆ రోజు ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభించలేదు. దీంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంట్రా ఇది.. అదేమైనా బస్సా.. విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..