ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పోలీస్ ఎస్‌పీఎఫ్ సబ్‌ఆర్డినేట్ సర్వీస్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 378 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీని బోర్డు త్వరలోనే ప్రకటించనుంది.
ఏపీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు
- ఎస్‌సీటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) – పురుషులు, మహిళలు పోస్టుల సంఖ్య: 253
- ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్) – పురుషులు, మహిళలు పోస్టుల సంఖ్య: 116
- సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) – పురుషులు పోస్టుల సంఖ్య: 9
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. వయోపరిమితి, ఇతర రిజర్వేషన్ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదార్ఢ్య కొలతలు (PMT), దేహదార్ఢ్య పరీక్షలు (PET), తుది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను నిబంధనల ప్రకారం తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,570 నుంచి రూ.1,27,480 వరకు పే స్కేల్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ, పరీక్ష తేదీలు, ఫీజు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను SLPRB AP అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది.
ఏపీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.