Headlines

Actress Roja : ఇకపై యాక్టింగ్ చేయ్యను వెళ్లిపోతా అని చెప్పా.. ఆ హీరో ఏమన్నారంటే..


టాలీవుడ్ హీరోయిన్ రోజా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన మధురానుభూతులను, మెగాస్టార్ చిరంజీవి, ఇతర నటులతో తనకున్న అనుబంధాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవి మాటలు తన జీవితాన్ని ఎలా మార్చాయో వివరించారు. ముఠా మేస్త్రి సినిమాలోని మామ మామ రొయ్య పట్టు చారు చేశా పాట షూటింగ్ సమయంలో, నటనపై అంతగా ఆసక్తి చూపని తనను ఉద్దేశించి చిరంజీవి, “నువ్వు ఎప్పుడూ యాక్టింగ్ వద్దనే దానివి, ఇంట్రెస్ట్ లేదు అనేదానివి. నీకు దేవుడు బలంగా రాసేశాడు చూడు ఎంత బాగా చేస్తున్నావో” అని ప్రశంసించారని రోజా తెలిపారు. ఈ మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని పెంచి, కెరీర్‌లో ముందుకు సాగేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఇదే పాటలోని 48 ఫ్రేమ్స్ బిట్‌లో చిరంజీవికి ధీటుగా నటించానని, సురేఖ అక్క కూడా తన డాన్స్‌ను మెచ్చుకునేవారని రోజా గర్వంగా చెప్పుకున్నారు.

చిరంజీవి, సురేఖతో కలిసి ఖైరతాబాద్‌లోని ఒక ప్రసిద్ధ బిర్యానీ షాపులో మారువేషాల్లో రహస్యంగా బిర్యానీ తిన్నప్పటి జ్ఞాపకాలను రోజా పంచుకున్నారు. అప్పటి క్రేజ్ దృష్ట్యా క్యాప్‌లు, చుడిదార్లు ధరించి వెళ్లేవాళ్ళమని, అయితే చివరికి గుర్తుపట్టేవారని తెలిపారు. బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేశానని, చిరంజీవితో మూడు సినిమాలు చేశానని పేర్కొన్నారు. తనకు ఏ హీరోలతో, హీరోయిన్లతో విభేదాలు రాలేదని, అందరితో స్నేహంగా ఉండేదానిని అని చెప్పారు. తోటి నటీనటులు జెలసీగా ఉన్నా, తాను మాత్రం హ్యాపీగా, నవ్వుతూ ఉండేదానిని అని తెలిపారు.

90వ దశకంలో విపరీతమైన పని ఒత్తిడి ఉండేదని, ఒక్కోసారి పగలు ఒక షూటింగ్, రాత్రి మరో షూటింగ్ చేసేదానిని అని రోజా గుర్తుచేసుకున్నారు. ముఠా మేస్త్రి షూటింగ్ తర్వాత, అదే రోజు రాత్రి నాగార్జున సినిమా కోసం గళ్ళుమంది బాస్ స్పెషల్ సాంగ్ చేశానని, ఇది నాగార్జునపై అభిమానంతోనే చేశానని చెప్పారు. నటీమణులు ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా, మొదట ఈ ట్రెండ్ మొదలుపెట్టింది తానే అని తెలిపారు. జానపదాలు, సాంఘికాలు, పౌరాణికాలు, నక్సలైట్ కథలు వంటి అన్ని రకాల జానర్‌లలో నటించిన ఏకైక నటి తానేనని రోజా గర్వంగా చెప్పారు. భైరవ ద్వీపంలో రాణి పాత్ర తనకు ఎంత మంచి పేరు తెచ్చిందో, ఆ తర్వాత చాలా సినిమాల్లో రాణి గెటప్‌లు వచ్చాయని, అన్నమయ్య సినిమాలో కూడా రుక్మాంబరి పాత్ర కోసం తననే కావాలని పిలిపించారని పేర్కొన్నారు. ఇవన్నీ భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తానని రోజా అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *