Headlines

Kota Srinivasa Rao: ఆ హీరో కష్టాన్ని కళ్లరా చూశాను.. అతడికి ఊరికే స్టార్ డమ్ రాలేదు మరి.. కోట శ్రీనివాస రావు..


తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి “మెగాస్టార్” అనే బిరుదు ఊరికే రాలేదని స్పష్టం చేశారు. చిరంజీవి అంకితభావాన్ని, నిరంతర కృషిని తాను స్వయంగా చూశానని, ఆయన పడ్డ కష్టాలు తన కళ్లారా చూశానని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణకు నిదర్శనంగా ఒక సంఘటనను కోట శ్రీనివాసరావు గుర్తుచేసుకున్నారు. ఒకరోజు షూటింగ్ లేదని భావించి, మధ్యాహ్నం ఎం.ఎస్. నారాయణతో కలిసి మందు తాగుతుండగా, అనుకోకుండా షూటింగ్‌కు పిలుపు వచ్చిందని తెలిపారు. సెట్‌కు వెళ్లగానే చిరంజీవి తనను తీవ్రంగా మందలించారని, “అయ్యా ఇలా రావడం ఏంటి?” అని కోప్పడ్డారని చెప్పారు. ఇది తనపై చిరంజీవికి ఉన్న శ్రేయోభిలాషను, కెరీర్ పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

చిరంజీవితో తన మొదటి పరిచయాన్ని కోట శ్రీనివాసరావు వివరించారు. రాజమండ్రిలోని అప్సరా హోటల్ వద్ద మొదటిసారి చిరంజీవిని చూసినప్పుడు, ఆయన ఒక చిన్న లంగోటీ ధరించి, మ్యూజిక్ పెట్టి పిచ్చిగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. మెడలో ఆంజనేయ స్వామి బెల్ట్‌తో, విపరీతమైన అంకితభావంతో డాన్స్ చేస్తున్న చిరంజీవిని చూసి, ఒక నటుడు సినిమాలో ఎంత కష్టపడాలో అప్పుడే తనకు అర్థమైందని కోట శ్రీనివాసరావు అన్నారు. వీరిద్దరూ కలిసి “ప్రాణం ఖరీదు” చిత్రంలో తొలిసారిగా నటించారు, ఆ తర్వాత “ఖైదీ నెం. 786” వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన కెరీర్‌లో వచ్చిన పాత్రల ప్రత్యేకతను వివరించారు. చాలావరకు పాత్రలకు ముందే పిలిచి చెప్పేవారు కాదని, “కోట చూసుకుంటాడు” అని రాసి పెట్టేవారని, తను వెళ్లి ఆ పాత్రను నింపుకోవాల్సి వచ్చేదని అన్నారు. జంధ్యాల సినిమాల్లో బట్టతల పాత్రల కోసం మాత్రం ముందుగానే పిలిచి, విగ్గులు లేకుండా సహజమైన రూపాన్ని కోరేవారని తెలిపారు. తన కెరీర్‌లో జంధ్యాల గారి సినిమాలను, కమర్షియల్ చిత్రాలను పోల్చుతూ, జంధ్యాల సినిమాలతో తను ఎక్కువ సౌకర్యంగా ఉండేవాడినని చెప్పారు. జంధ్యాల సినిమాల్లో మేకప్‌లు, విగ్గులు ఎక్కువగా ఉండవని, ఒకట్రెండు పేజీల డైలాగులు ఉంటాయని, ఆయన స్క్రిప్ట్ చదివేటప్పుడే నవ్వు వచ్చేదని, దర్శకుడిగా ఆయన గొప్ప నటుడని కోట శ్రీనివాసరావు ప్రశంసించారు. జంధ్యాల గారి సినిమాలను “హాస్యం” అని పిలుస్తారని, నేటి చిత్రాల్లో “కామెడీ”కి, “హాస్యం”కు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన తెలియజేశారు. “శత్రువు” సినిమాలోని “ముక్కేయలేదు” డైలాగ్, అది సామాన్య ప్రజల మాటల్లో భాగమైన తీరును కూడా కోట శ్రీనివాసరావు గుర్తుచేసుకున్నారు, తన పాత్రలకు ఎంతటి ప్రజాదరణ లభించిందో వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *