Headlines

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్


ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఉరుములతో వర్షం, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.

రానున్న 3 రోజుల వాతావరణ వివరాలు

గురువారం: శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

శుక్రవారం: ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది.

శనివారం: విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో వర్షాలు..

ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *