Headlines

ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు NEET UG 2026 కౌన్సెలింగ్‌ షురూ.. సెప్టెంబర్‌ 16 వరకే ఛాన్స్


అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్, నాన్‌మైనారిటీ ఆయుష్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా కింద వివిధ ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 8న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా బీఏఎంఎస్‌ (ఆయుర్వేద), బీహెచ్‌ఎంఎస్‌ (హోమియోపతి), బీయూఎంఎస్‌ (యునాని) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. NEET UG-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16వ తేదీ రాత్రి 9 గంటల్లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులను సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులకు అవకాశం ఉండదని అధికారులు సూచించారు.

NEET కటాఫ్‌ మార్కులు ఇలా..

జనరల్‌ (OC/EWS) కేటగిరీ అభ్యర్థులకు NEETలో 715 నుంచి 213 మార్కులు, అంటే 50వ పర్సంటైల్‌ అర్హతగా నిర్ణయించారు.
జనరల్‌ (OC/EWS-PwD) దివ్యాంగ అభ్యర్థులకు 212 నుంచి 177 మార్కులు, అంటే 45వ పర్సంటైల్‌ అర్హత ఉండాలి.
అదేవిధంగా 40వ పర్సంటైల్‌ అర్హత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 212 నుంచి 117 మార్కులు ఉండాలి. బీసీ/ఎస్సీ దివ్యాంగ అభ్యర్థులకు 193 నుంచి 177 మార్కులు, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 191 నుంచి 178 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు.

ఏ కోర్సుల్లో ప్రవేశాలు?

కన్వీనర్‌ కోటా కింద ఆయుష్‌ కళాశాలల్లో ఈ మూడు కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు..

ఇవి కూడా చదవండి



  • BAMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ
  • BHMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ
  • BUMS – బ్యాచిలర్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ అండ్‌ సర్జరీ

NEET UG-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని అర్హతలు, నిబంధనలు, కౌన్సెలింగ్‌ వివరాలను పూర్తిగా పరిశీలించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *