Headlines

హెయిర్‌ స్టైల్ మార్చేసిన ట్రంప్.. వెల్లువలా ట్రోల్స్, జోక్స్!


సెప్టెంబర్ 4న న్యూజెర్సీలోని ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దిగారు. గోల్ఫ్ క్లబ్ బెడ్‌మినిస్టర్‌ లో వారాంతం గడపడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్లో ఆయన జుట్టు ఎప్పట్లా కాకుండా చాలా ముదురు రంగులో, దాదాపు బ్రూనెట్‌లా కనిపించింది. విమానం దిగి నడుస్తున్న సమయంలో ఈ కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ట్రంప్ జుట్టు రంగు మారడం సోషల్ మీడియాలో వెంటనే పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా, తాను విగ్ పెట్టుకోనని ఆయన కొన్ని రోజుల క్రితం చెప్పిన నేపథ్యంలో ఈ కొత్త లుక్‌పై నెటిజన్లు రకరకాలుగా  స్పందించారు. ప్రసిద్ధ రచయిత అన్నీ లామాట్  స్పందిస్తూ.. ఈ కొత్త లుక్ ట్రంప్‌ను చాలా యవ్వనంగా కనిపించేలా చేస్తోందని, ప్రముఖ నటుడు పియర్స్ బ్రాస్నన్‌ను గుర్తుకు తెస్తోందని అన్నారు. ఒక వ్యక్తి స్పందిస్తూ.. గెట్టి ఇమేజెస్ లో  చూసుండకపోతే జుట్టు రంగు మారిన విషయాన్ని నమ్మేవాడినే కాదన్నారు. జియోపార్డీ ఛాంపియన్ హేమంత్ మెహతా సరదాగా స్పందిస్తూ.. ట్రంప్ జుట్టుపై ‘హెల్ టూపీ’ అంటూ జోక్ చేశారు. ఇంకొకరు నేరుగా “కొత్త విగ్ పెట్టుకున్నారా?” అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం ఇది సీజన్ మార్పు కావచ్చని అభిప్రాయపడ్డారు. వేసవి ముగిసే సమయం కావడంతో గోల్డెన్ బ్లాండ్ నుంచి బ్రూనెట్ రంగుకు మారడం సహజమేనంటూ మరో నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు.

డొనాల్డ్ ట్రంప్ తన హెయిర్‌స్టైల్‌లో అప్పుడప్పుడు ఇలాగే మార్పులు చేస్తుంటారు.  2019లో వర్జీనియాలోని ఓ చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్లిక్-బ్యాక్ హెయిర్‌స్టైల్‌తో కనిపించారు.అయితే ఆ మార్పు ఎక్కువ రోజులు నిలవలేదు, అదే రోజు సాయంత్రానికి ఆయన మళ్లీ తన సాధారణ హెయిర్‌స్టైల్‌కే మారిపోయారు.

ట్రంప్ జుట్టుపై విగ్ ధరిస్తారా, హెయిర్‌పీస్ ఉపయోగిస్తారా లేదా స్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటారా అనే ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే తన జుట్టు నిజమైనదేనని నిరూపించుకోవడానికి ఆయన గతంలో పలుమార్లు బహిరంగంగానే ప్రయత్నించారు.

తన జుట్టును చెదరగొట్టేందుకు అనుమతి

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఓ టీవీ షో లో పాల్గొన్న ట్రంప్.. షో హోస్ట్ జిమ్మీ ఫాలన్ తన జుట్టును ప్రేక్షకుల ముందే చెదరగొట్టేందుకు అనుమతించారు. తాను విగ్ ధరించడం లేదని నిరూపించేందుకే అలా చేశారు. “నేను విగ్ ధరించను. ఒకవేళ ధరించినా, అది నా తలపై ఎక్కువ సేపు నిలవదు” అని అప్పట్లో ట్రంప్ సరదాగా  వ్యాఖ్యానించారు.

దాదాపు దశాబ్దం తర్వాత.. న్యూజెర్సీలో కనిపించిన ముదురు రంగు జుట్టుతో ట్రంప్ చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ మార్పు ఉద్దేశపూర్వకంగా చేసిందా, తాత్కాలికమా, లేదా కేవలం లైటింగ్ ప్రభావం వల్ల అలా కనిపించిందా అనే దానిపై స్పష్టత లేదు.

చమురు ధరలు తగ్గుతాయి! ట్రంప్ భవిష్యవాణి

ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో చమురు ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరిగే పోరులో అమెరికా విజయం సాధించిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పడిపోతాయని ట్రంప్ అంచనా వేశారు. మొదట గ్యాలన్‌కు 3 డాలర్లు, ఆ తర్వాత ఏకంగా 2 డాలర్ల కంటే దిగువకు పడిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా కచ్చితంగా అడ్డుకుంటుందని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

హార్ముజ్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత 


మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 
97 డాలర్లకు చేరింది. గత ఐదు రోజుల్లో ఇది 9% పెరగగా, నెలవారీగా దాదాపు 19% వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, నౌకలపై దాడుల నేపథ్యంలో సరఫరా నిలిచిపోతుందనే భయాలు మార్కెట్లో ధరలను మరింత పెంచుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *