Headlines

అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు


చనిపోయాడని భావించిన కన్నబిడ్డ క్షేమంగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. పంజాబ్‌లోని కపుర్తలాలో సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. కపుర్తలాకు చెందిన రవి కుమార్‌ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతని తండ్రి, సోదరుడు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో, పోలీసులకు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక యువకుడి మృతదేహం లభ్యమైనట్టు కుటుంబానికి సమాచారం అందింది. పోలీసులు చూపించిన ఫోటోలను చూసి ఆ మృతదేహం రవి కుమార్‌దేనని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ధారించారు. దీంతో తమ కుమారుడు మరణించాడని తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబం ఆగస్టు 13న ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసింది. తమ కుమారుడు ఇక లేడని భావిస్తూ వారు శోకసంద్రంలో మునిగిపోయారు.అయితే, ఈ కథలో అసలు ట్విస్ట్ సెప్టెంబర్ 2న వెలుగు చూసింది. కపుర్తలా సెంట్రల్ జైల్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆ కుటుంబాన్ని నివ్వెరపోయేలా చేసింది. రవి కుమార్ జైల్లో ఉన్నాడని, వచ్చి కలవాలని జైలు సిబ్బంది సమాచారం అందించారు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *