Headlines

మల్టీప్లెక్స్.. పాత పంచాయితీ కొత్తగా షురూ..!


ఇండస్ట్రీలో ఓటీటీ (ఓవర్-ది-టాప్) వర్సెస్ మల్టీప్లెక్స్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఓటీటీ విండో వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు విడుదలైన రెండు మూడు వారాలకే థియేటర్లలో ఆదరణ తగ్గుతున్నప్పుడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి ఎందుకు ఇవ్వకూడదు అనేది నిర్మాతల వాదన. అయితే, ప్రేక్షకులు నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందని భావించి థియేటర్లకు రావడం మానేస్తున్నారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కౌంటర్ ఇస్తున్నాయి.బాలీవుడ్‌లో సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. ఈ ఎనిమిది వారాల నిబంధనను బ్రేక్ చేసినవారికి మల్టీప్లెక్స్‌లలో షోలు ఇవ్వకుండా బ్యాన్ చేస్తారు. సౌత్‌లో మలయాళం మినహా తెలుగు, తమిళ్ సినిమాలు కేవలం 28 రోజులకే ఓటీటీకి వస్తున్నాయి. దీనిని మార్చేందుకు నేషనల్ మల్టీప్లెక్స్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల ఒక మలయాళ డబ్బింగ్ సినిమాకు 14 రోజుల్లో ఓటీటీకి వస్తుందనే కారణంతో కొన్ని మల్టీప్లెక్స్‌లు షోలు ఇవ్వలేదు.వందల కోట్లు కొల్లగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి సినిమాలు కూడా మహా అయితే నాలుగు వారాలకు మించి ఆడలేదు కాబట్టి, రెండు నెలల గ్యాప్ మన దగ్గర ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు

హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

క్రేజీగా కమల్‌ లైనప్‌… షూటింగ్‌ స్టేటసేంటి?

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *