Headlines

నిమ్మకాయ, లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..  రూపాయి ఖర్చు లేని సహజ చిట్కా!


వర్షాకాలం, ఉక్కపోత వాతావరణంలో ఇళ్లలోకి దోమల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. వీటిని తరిమికొట్టేందుకు మార్కెట్లో లభించే కెమికల్ కాయిల్స్, స్ప్రేలు వాడటం కంటే ఇంట్లోనే లభించే నిమ్మకాయ, లవంగాలతో సహజ సిద్ధమైన పరిష్కారం పొందవచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన ఆయుర్వేద చిట్కా.

నిమ్మకాయ-లవంగాల సింపుల్ హ్యాక్: ఈ చిట్కా కోసం ఒక తాజా నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా కోయాలి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై కొన్ని లవంగాలను గుచ్చాలి. మొగ్గ భాగం పైన కనిపించేలా ఉండాలి. ఇలా సిద్ధం చేసిన నిమ్మకాయ ముక్కలను కిటికీలు, తలుపుల వద్ద, పరదాల వెనుక లేదా సోఫాల కింద దోమలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ఉంచాలి. లవంగాలలోని యూజెనాల్ అనే కాంపౌండ్, నిమ్మకాయ సిట్రస్ వాసన కలిసి దోమలను ఆ ప్రాంతం నుంచి దూరంగా తరిమివేస్తాయి.

నిమ్మకాయ-వాము దీపం చిట్కా: ఇంట్లో దోమల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటే మరొక ప్రభావవంతమైన పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఒక నిమ్మకాయ పైన కొంత భాగాన్ని కోసి, లోపలి గుజ్జును తీసి ప్రమిదలా తయారు చేయాలి. అందులో కొద్దిగా ఆవనూనె, 4-5 లవంగాలు, కొద్దిగా వాము వేయాలి. దూదితో వత్తి చేసి ఆ ప్రమిదలో దీపం వెలిగించాలి.

ఇవి కూడా చదవండి



వాములోని థైమాల్‌, ఆవనూనె పొగ దోమలను, ఇతర చిన్న కీటకాలను తక్షణమే పారదోలుతాయి. ఈ సహజ సిద్ధమైన చిట్కాలతో పాటు, దోమల సంతతి పెరగకుండా ఉండటానికి ఇంట్లో లేదా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కిటికీలకు నెట్ అమర్చుకోవడం, ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ముప్పు నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. నిద్రపోయే ముందు ఈ చిన్న చిట్కాలను పాటించి, ప్రశాంతమైన ఆరోగ్యకరమైన నిద్రను పొందండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *