Headlines

రోజూ చిటికెడు ఇంగువ తింటే ఇన్ని లాభాలా..? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..


వంటకాల్లో మంచి రుచి, సువాసన కోసం వాడే ఇంగువ కేవలం పోపు దినుసు మాత్రమే కాదు.. అద్భుతమైన ఔషధ గుణాలున్న పదార్థం. రోజూ చిటికెడు ఇంగువను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి, కడుపులో నులిపురుగుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అలాగే, మహిళల్లో నెలసరి నొప్పులను తగ్గించడానికి మరియు తీవ్రమైన తలనొప్పిని నివారించడానికి కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. మరిన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం..

ఇంగువతో కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:

అజీర్తి, గ్యాస్ సమస్యలకు చెక్:

ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పితో బాధపడేవారికి ఇంగువ రామబాణంలా పనిచేస్తుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, పిల్లల్లో, పెద్దల్లో వచ్చే కడుపులోని నులిపురుగుల సమస్యను నివారించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఇవి కూడా చదవండి



రక్తపోటు నియంత్రణ :

ఇంగువలో ఉండే సహజసిద్ధమైన మూలకాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వచ్చి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

దగ్గు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం:

జలుబు, దగ్గు, కోరింత దగ్గు, ఆస్తమా లేదా బ్రోన్కైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని పాలలో లేదా నీటిలో కొద్దిగా ఇంగువ కలిపి తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

నెలసరి నొప్పికి ఉపశమనం:

మహిళల్లో రుతుక్రమం సమయంలో వచ్చే తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, కండరాల పట్టుత్వానికి ఇంగువ చక్కటి పరిష్కారం. ఇది రక్త ప్రసరణను వేగవంతం చేసి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా నెలసరి నొప్పిని తగ్గిస్తుంది.

తలనొప్పి నివారణ:

తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు నీటిలో 2 చిటికెల ఇంగువ వేసి మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజుకు రెండుసార్లు తాగితే తలనొప్పి త్వరగా తగ్గుతుంది.

వంట్లో వచ్చే చిన్న చిన్న రుగ్మతలకు ప్రతిసారీ మందులు వాడకుండా, ఇంట్లో ఉండే ఇంగువను క్రమం తప్పకుండా సరైన పరిమాణంలో ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, సమగ్ర ఆరోగ్యం సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *