Headlines

వేడెక్కుతున్న భూమి..ధనిక దేశాలకు పట్టదా? ఐరాస సీరియస్!


భూమి వేడిని తగ్గించి మళ్లీ సాధారణ స్థితికి తేవాలంటే కేవలం పొగలు, కాలుష్యం తగ్గించడం ఒక్కటే సరిపోదు. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చేసే ఆధునిక సాంకేతికతతో పని చేసే పరికరాలను వాడటంతో పాటు, దేశాల వ్యాప్తంగా విపరీతంగా మొక్కలు నాటి అడవులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుటెరస్ చెబుతున్నారు. అయితే ఇదే అదనుగా పెద్ద కంపెనీలు, దేశాలు బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని ఆపకుండా కాలయాపన చేస్తుండటాన్నితీవ్రంగా తప్పుపట్టారు. ముందుగా శిలాజ ఇంధనాల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకడమే అసలైన పరిష్కారమని స్పష్టం చేసారు.

ఈ వాతావరణ ముప్పుకు ప్రధాన కారణమైన ధనిక, అభివృద్ధి దేశాలు వెంటనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ఈ పోరాటంలో ముందుండి నడిపించాలని ఐరాస నివేదిక తేల్చిచెప్పింది. ఇకపై పాత పద్ధతులు అస్సలు పనిచేయవని, ప్రతి దేశం కలిసికట్టుగా ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు గట్టి ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చింది. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పరిమితి కోసం చేసే ఈ పోరాటం కేవలం ప్రకృతి కోసం కాదని… ఇది భూమ్మీద మనుషుల మనుగడ సాగించడానికే జరుగుతున్న ఆఖరు పోరాటమని ఐరాస అధినేత ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *