Headlines

ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!


టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. మరీ విచిత్రమేంటంటే..ఉన్నత చదువులు చదువుకుని బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న విద్యావంతులు కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్నారు. సైన్స్‌ని నమ్మేవాళ్ల కామన్‌సెన్స్‌ ఏ స్థాయికి దిగజారిందో చెప్పే వార్త ఇది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రభుత్వాసుపత్రిలో ఆది నాగశేషు, లక్ష్మీ మోనాలిసా డాక్టర్‌గిరీ వెలగబెడుతున్నారు. నాగశేషు ఎండీ-జనరల్ మెడిసిన్. లక్ష్మీ మోనాలిసా… సర్జరీల వేళ ఎనస్తీషియా ఇచ్చే డాక్టర్. వీళ్లిద్దరి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు నడుస్తున్నాయి. ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లే క్షుద్రపూజలు, చేతబడులంటూ ఒకరిపై ఒకరు వింత ఆరోపణలు చేసుకుంటూ నవ్వులపాలవుతున్నారు. ఆదోనిలో వేర్వేరుగా ప్రైవేట్ క్లినిక్‌లు కూడా నడిపిస్తున్న వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్యపోరు సాగుతోంది. సూపరింటెండెంట్ ప్రమోషన్ల వ్యవహారం తెరపైకి రావడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. తనకు రావలసిన సూపరింటెండెంట్ ప్రమోషన్‌కు డాక్టర్ లక్ష్మీ మోనాలిసా అడ్డుపడుతున్నారని, తనను అడ్డుతొలగించుకునేందుకు ఆమె చేతబడి చేయించారంటూ డాక్టర్ ఆది నాగశేషు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను కూడా చూపుతుండటం గమనార్హం. సైన్స్ చదివి ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులే చేతబడులను నమ్మడం, ఆస్పత్రిలో రచ్చ చేయడం చూసి తోటి సిబ్బంది, స్థానికులు విస్మయం చెందుతున్నార. చదువుకున్న వైద్యుల మూర్ఖపు చేష్టలపై ప్రజలు మండిపడుతున్నారు. వీరిద్దరిపై కఠిన చర్యలు తీసుకుని ఆసుపత్రి నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు

మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !

పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్

ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్

Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *