సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. ఇది అమావాస్య తిథి ప్రారంభం, సెప్టెంబర్ 10,2026 గురు వారం ఉదయం 10.33 గంటలకు మొదలు అయ్యి, సెప్టెంబర్ 11,2026 శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
అమావాస్య రోజున లక్ష్మీ పూజ, పితృ తర్పణాల వంటివి చేయడం చాలా శుభప్రదం అని చెప్తుంటారు పండితులు. దీని వలన ఇంటిలో ఉన్న ప్రతి కూలతలు తొలిగిపోయి, ఇంటిలో సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారని చెబుతున్నారు పండితులు.
అలాగే ఈ పొలల అమావాస్య అర్థరాత్రి సమయంలో, 12 గంటలకు ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనె దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందంట. ఎవరు అయితే నరదిష్టితో బాధపడుతున్నారో, అలాగే ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవున్నారో, వారు వాటి నుంచి బయటపడి, అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఈ సమయంలో దీపం పెట్టడం చాలా మంచిదంట.
అదే విధంగా అమావాస్య అర్థరాత్రి సమయంలో, లక్ష్మీదేవి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదవడం, పేదవారికి అన్నదానం చేయడం ,అంతే కాకుండా నల్ల నువ్వులు దానం చేయడం, నల్లటి వస్త్రాలు దానం చేయడం వలన అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అర్థరాత్రి సమయంలో బటయకు వెళ్లకూడదంట. ఎందుకంటే? ఈ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది అనేక రకాలుగా సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




