ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన 1993 నాటి వారసుడు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ మల్టీస్టారర్ చిత్రం విడుదలైన రోజు నుంచి పెను సంచలనానికి దారి తీసింది, ముఖ్యంగా అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సినిమా అఖండ విజయం సాధించినప్పటికీ, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు నేటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు పెద్ద హీరోలతో సినిమా చేయాలనేది ఒక కల. అప్పటికే కామెడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈవీవీని మురళీమోహన్ తన జైభేరి బ్యానర్ పై నాగార్జునకు పరిచయం చేశారు. నాగార్జున సూచన మేరకు, హిందీ బ్లాక్ బస్టర్ ఫూల్ ఔర్ కాంటేను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ కథలో తండ్రి పాత్ర ఎంతో కీలమైనది. మొదట మురళీమోహన్ ఈ పాత్రను చేయాలనుకున్నా, సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి ఒక సీనియర్ హీరో ఉండాలని భావించి సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించారు.
ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక
మొదట కృష్ణ తన అభిమానులు నెగటివ్ షేడ్స్ ఉన్న తండ్రి పాత్రను అంగీకరించరని తిరస్కరించినా, నాగార్జున పట్టుబట్టడంతో, కథలో కొన్ని మార్పులు చేసి ఆయనను ఒప్పించారు. భారీ బడ్జెట్ తో 1992లో ప్రారంభమైన ఈ సినిమా 1993 మే 6న విడుదలైంది. వారసుడు విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య సాగే ఘర్షణ సన్నివేశాలలో నాగార్జున, కృష్ణను వాడు వీడు అని మాట్లాడటం, కాలర్ పట్టుకోవడం వంటివి కృష్ణ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ హీరోను తక్కువ చేసి చూపారని, నాగార్జునను హైలైట్ చేశారని భావించిన కృష్ణ అభిమానులు రోడ్లపైకి వచ్చారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్లను దహనం చేశారు. థియేటర్లలో బాక్సులు, సీట్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, నిర్మాత మురళీమోహన్‌పై కూడా కృష్ణ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక
పరిస్థితి విషమించడంతో, వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి కృష్ణ, నాగార్జున, ఈవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా, అభిమానుల మనసులను గెలుచుకోవడానికి, క్లైమాక్స్‌లో కృష్ణ గారిపై ఒక ప్రత్యేక ఫైట్ సీన్‌ను చిత్రీకరించి సినిమాలో అదనంగా చేర్చారు. అయినప్పటికీ, కృష్ణ అభిమానులు శాంతించకుండా కొద్ది రోజుల పాటు తమ ఆందోళన కొనసాగించారు. ఈ వివాదాలన్నీ ఉన్నప్పటికీ, వారసుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అప్పట్లో దాదాపు నాలుగు కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం, మొదటి వారంలోనే ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. 50 రోజుల్లో ఆరున్నర కోట్లకు పైగా, మొత్తం థియేట్రికల్ రన్‌లో ఎనిమిదిన్నర కోట్ల వరకు వసూలు చేసి, ఆనాటి టాలీవుడ్‌లో అత్యధిక గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్, నగ్మా గ్లామర్, కీరవాణి అందించిన సంగీతం, అంతకుమించి సూపర్ స్టార్ కృష్ణ శక్తివంతమైన నటన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయానికి దోహదపడ్డాయి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.