Headlines

Renu Desai: సెకండ్ ఇన్నింగ్స్ మీద ఆశలు పెట్టుకున్న రేణు దేశాయ్‌

Renu Desai: సెకండ్ ఇన్నింగ్స్ మీద ఆశలు పెట్టుకున్న రేణు దేశాయ్‌


బద్రి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్‌, కొద్ది రోజుల్లోనే యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పేశారు. చాలా కాలం తరువాత మళ్లీ రీ ఎంట్రీ మీద ఫోకస్ చేస్తున్న ఈమె బిగ్ బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ట్రై చేశారు. కానీ మూవీ ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవటంతో షార్ట్ గ్యాప్‌ తరువాత మళ్లీ ట్రై చేస్తున్నారు. ఇంతకీ రేణు చేస్తున్న సినిమా ఏంటి? ఆ సినిమాతోనైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? ఒకప్పుడు హీరోయిన్‌గా స్క్రీన్ మీద సందడి చేసిన రేణు దేశాయ్.. ఆ తర్వాత డైరెక్షన్, ప్రొడక్షన్ అంటూ బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో కనిపించినా.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో రేణు రీ ఎంట్రీకి సరైన బ్రేక్ రాలేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా మెప్పించలేకపోయినా.. రేణు దేశాయ్ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే మరో బంపర్ ఆఫర్‌ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు రేణుదేశాయ్‌. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి భార్యగా, ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. సెకండ్‌ ఇన్సింగ్స్‌లో రెగ్యులర్‌ అక్క, వదినా లాంటి పాత్రలు కాకుండా స్పెషల్ ఐడెంటిటీ ఉండే క్యారెక్టర్స్‌ను ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు రేణు దేశాయి. వేగంగా సినిమాలు చేయటం కన్నా… మంచి రోల్స్‌లో మెప్పించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి ఓం సినిమాలో ఆమె చేస్తున్న క్యారెక్టర్‌ ఫ్యూచర్‌లో ఆమెకు అలాంటి మరిన్ని క్యారెక్టర్స్‌ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *