Headlines

Hardik Pandya : హార్దిక్ ట్రేడింగ్‌పై ముంబై ఇండియన్స్ క్లారిటీ.. సీఎస్‌కే డీల్‌పై అసలు నిజం ఇదే

Hardik Pandya : హార్దిక్ ట్రేడింగ్‌పై ముంబై ఇండియన్స్ క్లారిటీ.. సీఎస్‌కే డీల్‌పై అసలు నిజం ఇదే


Hardik Pandya : భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రేడింగ్ అంశం గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్ మినహా ఐపీఎల్ లోని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్‌ను తమ జట్టులోకి తెచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ రసవత్తర రేసులో చెన్నై సూపర్ కింగ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యాకు ప్రతిగా చెన్నై నుంచి శివమ్ దూబె, ఆయుష్ మ్హాత్రే వంటి ఆటగాళ్లను ముంబై డిమాండ్ చేసిందని, లేదా డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబెతో పాటు రూ. 10 కోట్ల నగదు డీల్ ఆఫర్ లో ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది.

అసలు నిజం బయటపెట్టిన ముంబై ఇండియన్స్

ఈ ఊహాగానాలు, రూమర్లకు ముంబై ఇండియన్స్ స్పూర్తిదాయక ముగింపు పలికింది. స్పోర్ట్‌స్టార్ కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వార్తలను ముంబై ఇండియన్స్ అధికారిక ప్రతినిధి ఖండించారు. ప్రస్తుతానికి తాము ఎలాంటి ఆటగాళ్ల ట్రేడింగ్ చర్చల్లోనూ పాల్గొనడం లేదని, ఇటీవల మీడియాలో వస్తున్న రిపోర్టులు కేవలం పుకార్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత నిర్వహించే పోస్ట్-సీజన్ రివ్యూ ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.

రివ్యూ మీటింగ్ తర్వాతే నిర్ణయం

ముంబై ఇండియన్స్ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. “మా జట్టు పోస్ట్-సీజన్ రివ్యూ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. మేము జట్టుకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తున్నాం. మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా.. మేము ప్రస్తుతం ఇతర ఫ్రాంచైజీలతో ఎలాంటి ప్లేయర్ ట్రేడింగ్ చర్చలు జరపడం లేదు. రివ్యూ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్లేయర్ల ట్రేడింగ్ లేదా ఇతర విషయాలపై మాట్లాడడం సాధ్యమవుతుంది. మా ముందుకు అనేక ఆప్షన్లు, ఆలోచనలు వచ్చాయి, వాటిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుంది” అని వెల్లడించారు. దీనిబట్టి రివ్యూ ముగిశాకే హార్దిక్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ముంబై కెప్టెన్‌గా నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా

2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను ట్రేడింగ్ ద్వారా మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది. గుజరాత్‌ను ఒకసారి విజేతగా, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన ట్రాక్ రికార్డు ఉండటంతో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగింది. మొదటి ఏడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా, ఐపీఎల్ 2026లో కూడా ముంబై తీవ్రంగా విఫలమైంది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌లు ఓడిపోయి, కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ వైఫల్యాల నేపథ్యంలోనే హార్దిక్ ఐపీఎల్ ట్రేడింగ్ వార్తలు ఊపందుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *