Headlines

Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..

Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే..


పెళ్లిన మరుసటి రోజే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న ఆరిఫుద్దీన్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 30 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం తర్వాత, కొన్ని వ్యక్తిగత కారణాలతో మొదటి భార్యతో విడిపోయాడు. వయసు పైబడుతున్న కొద్దీ ఒంటరితనం అతన్ని వేధించింది. తోడుగా ఒకరు ఉంటే బాగుంటుందన్న ఆశతో ఉన్న ఆరిఫుద్దీన్‌కు.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళతో వివాహ సంబంధం కుదిరింది. ఒంటరి జీవితానికి ఇక స్వస్తి పలకవచ్చని, మళ్లీ తన జీవితంలో వసంతం రాబోతోందని అతను ఎంతో సంబరపడ్డాడు. జీవితంలో తోడు దొరికిందని మురిసిపోయాడు. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోవడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం అమ్మాయి తరపు వారికి 60 వేల రూపాయలు ఎదురు ఇచ్చాడు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితం మొదలైందని ఆశపడ్డాడు. కానీ అదే పెళ్లి ఇప్పుడు అతడి జీవితంలో అంతులేని ప్రశ్నలను మిగిల్చింది.

పెళ్లి జరిగింది.. నవ వధువు ఇంటికి వచ్చింది. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్‌.! మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో వధువు లేదు! ఇల్లంతా వెతికాడు.. బంధువులను అడిగాడు.. తెలిసిన వారిని సంప్రదించాడు… కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఏమైంది? రాత్రికి రాత్రే ఎక్కడికి వెళ్ళింది? ఎవరితోనైనా వెళ్లిపోయిందా? ఈ ప్రశ్నలు ఆరిఫుద్దీన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కనీసం అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. దీంతో ఇది ముందస్తుగా వేసిన పక్కా స్కెచ్ ఏమోనన్న అనుమానాలు బలపడ్డాయి. ఆరిఫుద్దీన్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.

ఇప్పుడు ప్రశ్న ఒకటే.. పెళ్లయిన కొన్ని గంటల్లోనే వధువు ఎందుకు అదృశ్యమైంది? డబ్బు కోసమే ఈ పెళ్లి నాటకం ఆడారా? లేక దీని వెనుక మరేదైనా రహస్యం దాగి ఉందా? కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వధువు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ సాగుతోంది.

వీడియో చూడండి..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *