Headlines

August 2026: ఈ నెలలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? కొనాలనుకునేవారు తప్పక తెలుసుకోండి

August 2026: ఈ నెలలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? కొనాలనుకునేవారు తప్పక తెలుసుకోండి


ఆగస్టు నెలలో భారత్‌లో బంగారం, వెండి ధరలపై పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై నెలలో నాలుగు నెలల తర్వాత బంగారం అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా కోలుకోగా, వెండి మాత్రం నెలవారీగా తగ్గుదల కనిపించింది. భారతీయ బులియన్ మార్కెట్‌లో కూడా రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

ఆగస్టులో ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలు

  1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంకేతాలు
  2. డాలర్ ఇండెక్స్‌లో మార్పులు
  3. రూపాయి-డాలర్ మారకం విలువ
  4. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు
  5. కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు

ఈ అంశాల్లో ఏదైనా కీలక మార్పు వస్తే ధరల్లో ఒక్కసారిగా హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పలు అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆగస్టు నెలలో బంగారం భారీ ర్యాలీ కంటే ఒక నిర్దిష్ట పరిధిలో ధరలు పెరిగే అవకాశం ఎక్కువ. అయితే నెలాఖరు లేదా ఆ తర్వాత మళ్లీ కొనుగోళ్ల ఒత్తిడి పెరిగితే ధరలు ఒక్కసారిగి భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు బంగారం కంటే ఎక్కువ అస్థిరతను చూపే అవకాశముందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

కొనుగోలుదారులు ఏం చేయాలి?

ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిపుణులు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కంటే విడతలవారీగా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనిని రూపీ కాస్ట్ అవరేజింగ్ విధానంగా పరిగణిస్తారు. ధరలు తగ్గితే సగటు కొనుగోలు ధర తగ్గే అవకాశం ఉంటుంది. వెండి విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు. పరిశ్రమల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా వెండి ధరల్లో బంగారం కంటే ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండొచ్చని చెబుతున్నారు.

పెట్టుబడిదారులకు సూచనలు

పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండికి పరిమిత కేటాయింపే మంచిదని పెట్టుబడి నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం పెట్టుబడిలో సుమారు 5 శాతం నుంచి 15 శాతం వరకు బంగారం లేదా విలువైన లోహాల్లో ఉంచడం వల్ల డీవేసిఫికేషన్ లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే స్వల్పకాలిక ధరల అంచనాల ఆధారంగా కాకుండా, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

ఆగస్టులో ట్రెండ్ ఎలా ఉండొచ్చు?

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, ఆగస్టు నెలలో బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిర ధోరణిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వెండి మాత్రం అధిక అస్థిరతను ప్రదర్శించే అవకాశముంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సంకేతాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు ఈ నెలలో ధరలకు ప్రధాన దిశను నిర్దేశించే అవకాశముంది. అందువల్ల ధరల మార్పులను గమనిస్తూ దశలవారీగా కొనుగోలు చేయడం చాలా మంది విశ్లేషకుల సాధారణ సూచనగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *