Headlines

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’


భారతీయ రైల్వే వేగానికి మరో మైలురాయి తోడైంది. ప్యాసింజర్ ప్రయాణాల్లో సంచలనం సృష్టించిన ‘వందే భారత్’ ఇప్పుడు సరుకు రవాణా రంగానికి విస్తరించింది. దేశంలోనే మొట్టమొదటి ‘వందే భారత్ కార్గో’ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కోటా నుంచి మహిద్‌పూర్ రోడ్ మధ్య నిర్వహించిన పరీక్షల్లో ఈ హైస్పీడ్ గూడ్స్ రైలు ఏకంగా గంటకు 145 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం విశేషం. ఆర్డీఎస్‌ఓ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు వివిధ వేగ పరిమితులలో ఈ ప్రయోగాత్మక పరీక్షలు జరగనున్నాయి. 16 కోచ్‌లతో రూపుదిద్దుకున్న ఈ రైలులో 12 పార్శిల్ కోచ్‌లు, 2 కోల్డ్ స్టోరేజ్ కోచ్‌లు ఉన్నాయి. దీని మొత్తం పేలోడ్ సామర్థ్యం 397.02 టన్నులు. పండ్లు, కూరగాయలు, మందుల వంటి త్వరగా పాడైపోయే వస్తువులను అత్యంత వేగంగా చేరవేసేందుకు ఇందులో ప్రత్యేక రిఫ్రిజిరేటెడ్ సౌకర్యాలను కల్పించారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్ లాకింగ్, ఫైర్ డిటెక్షన్ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమర్చారు. రైలు వేగం 5 కి.మీ దాటగానే తలుపులన్నీ స్వయంచాలకంగా లాక్ అవుతాయి. ఈ వందే భారత్ కార్గో అందుబాటులోకి వస్తే దేశంలో ఇ-కామర్స్, లాజిస్టిక్స్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని రైల్వే శాఖ భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్!

వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!

రైలు ఇంజిన్‌ చెక్‌ చేస్తున్న పైలట్‌.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్‌

ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *