రోజు రోజుకీ కేటుగాళ్ల మోసాలకు అంతులేకుండా పోతోంది. పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఆఖరికి పేద విద్యార్ధుల చదువుకోసం ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని కూడా దోచేస్తున్నారు. అమాయక మహిళలను మోసం చేసి తల్లికి వందనం డబ్బులు కాజేసిన ఘరానా మోసం కర్నూలులో వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్లో కర్నూలు నగరంలోని పాతబస్తీ, ప్రజానగర్ కాలనీల్లో ఓ ప్రైవేట్ టెలికాం ప్రతినిధి ఉచితంగా సిమ్ కార్డులు ఇస్తామని నమ్మబలికాడు. స్థానిక మహిళల నుంచి ఆధార్ కార్డులు సేకరించి, వారికే తెలియకుండా పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను తెరిచాడు. అనంతరం ప్రభుత్వం ‘తల్లికి వందనం’ కింద జమ చేసిన నగదును గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేశాడు. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చిన లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో తనిఖీ చేయగా ఈ మోసం బయటపడింది. దాదాపు 60 మందికి పైగా మహిళలు ఈ విధంగా బాధితులుగా మారారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేమని, తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ సీఐ మారుతి శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎంతమంది మోసపోయారనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!
Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’
హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్ఎక్స్.. స్టార్షిప్
పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్!
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!