Headlines

రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..?

రెండు టీమ్స్ సూపర్.. కానీ, ఏ టీమ్‌తో వెళ్తే 2027 వరల్డ్ కప్ గ్యారెంటీ అంటే..?


2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, రవిశాస్త్రి ఇప్పటికే తమ డ్రీమ్ టీమ్స్‌ను ప్రకటించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీకి ఎలాంటి జట్టుతో వెళ్లాలన్న దానిపై ఇద్దరూ తమదైన ఆలోచనలను వెల్లడించారు. అయితే ఈ రెండు జట్లను పోల్చి చూస్తే ఎవరి ఎంపిక బలంగా ఉంది? ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఏ జట్టుకు ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ ఆసక్తికరంగా మారింది.

సీనియర్స్‌ వైపు వసీం జాఫర్

వసీం జాఫర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా జట్టుకు సమతుల్యత తీసుకొస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉండటం ఈ జట్టు ప్రధాన బలం. ముఖ్యంగా గత ఐసీసీ టోర్నీల అనుభవం ఉన్న ఆటగాళ్లతో జాఫర్ జట్టును నిర్మించాడు.

యంగస్టర్స్ వైపు రవిశాస్త్రి

రవిశాస్త్రి మాత్రం సీనియర్ ప్లేయర్లు, యంగ్ ప్లేయర్ల కలయికకు ప్రాధాన్యం ఇచ్చాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం ద్వారా భవిష్యత్ నాయకత్వంపై తన నమ్మకాన్ని చాటాడు. రోహిత్, కోహ్లీ, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి బ్యాటర్లతో పాటు హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్‌లను ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేశాడు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, సిరాజ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్‌ను చేర్చడం ద్వారా ఎడమచేతి పేసర్ ఎంపికపై దృష్టి పెట్టాడు.

Ravi Shastri Dream Team

ఫొటో: రవిశాస్త్రి ప్రకటించిన స్క్వౌడ్

ఇది కూడా చదవొచ్చు కదా: రూ.300 కోట్లను ఎడమకాలితో తన్నాడు.. ఇప్పుడు కోహ్లీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసా?

రెండు జట్ల మధ్య కీలక తేడా ఇదే

జాఫర్ జట్టులో కేవలం ప్లేయింగ్ ఎలెవన్ మాత్రమే ఉండగా, శాస్త్రి 15 మంది సభ్యులతో కూడిన పూర్తి స్క్వాడ్‌ను ఎంపిక చేశాడు. జాఫర్ జట్టు పూర్తిగా ప్రస్తుతం నిరూపించుకున్న ఆటగాళ్లపై ఆధారపడితే, శాస్త్రి జట్టులో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చాడు. అలాగే రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి మ్యాచ్‌ను మలుపుతిప్పగల ఆటగాళ్లు శాస్త్రి జట్టుకు అదనపు బలంగా కనిపిస్తున్నారు.

ఎవరి టీమ్ కప్పు కొట్టే ఛాన్స్ ఉంది?

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రవిశాస్త్రి ఎంపిక చేసిన జట్టు కొంత ఎక్కువ సమతుల్యతతో కనిపిస్తోంది. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉండటం వల్ల దీర్ఘకాలిక టోర్నీలో వివిధ పరిస్థితులకు అనుగుణంగా జట్టును మార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌లో ప్రత్యామ్నాయాల కొరత ఉండదు. మరోవైపు జాఫర్ జట్టు అత్యంత అనుభవజ్ఞులపై ఆధారపడిన బలమైన ప్లేయింగ్ ఎలెవన్‌గా కనిపిస్తోంది. అయితే ప్రపంచకప్‌కు ఇంకా చాలాసమయం ఉండటంతో ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్, కొత్త ప్రతిభావంతుల ఎదుగుదల ఆధారంగా భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం సమతుల్యత, బెంచ్ స్ట్రెంగ్త్, భవిష్యత్ ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటే రవిశాస్త్రి ఎంపిక చేసిన జట్టుకే కాస్త ఎక్కువ ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ, వసీం జాఫర్ ఎంపిక చేసిన అనుభవజ్ఞుల జట్టును కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *