ఇంటి పెరట్లో ఈ మొక్క కచ్చితంగా మొక్కలలో వాము కూడా ఒకటి. చిన్న పిల్లలు ఉన్నవాళ్లు ఈ వాము మొక్కలు పెంచితే ఎన్నో సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఇక వాము గింజలను మీ వంటకాలతో పాటు అనేక పానీయాలు తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు
చిన్న పిల్లలకు ఏది తిన్నా కూడా సరిగా అరగదు అలాంటి వాళ్ళకి ఈ వాము ఆకు గొప్ప ఔషధం. ఈ వాము ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి మీ పిల్లలకు తాగిస్తే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంకా దగ్గు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటికీ కూడా ఇది చెక్ పెడుతుంది. ఈ వాము ఆకు నీరు మంచి నేచురల్ మెడిసిన్ అని చెప్పాలి.
ఇంకా కాలిన గాయాలు, మచ్చలను కూడా ఈ వాము తగ్గేలా హెల్ప్ చేస్తుంది. ఇంకా దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి.
ఇది గాయాలను త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులు తలనొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇంకా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ రసాన్ని తీసి తలకు రాస్తే తలనొప్పి తగ్గుతుంది..
మీ శరీరంపై పురుగులు కుట్టినా కూడా ఈ వాము ఆకును అక్కడ రుద్దితే విషం మొత్తం బయటకు పోతోంది. ఇంకా మీరు ఈ వాము ఆకులను నమిలితే కడుపునొప్పి సమస్యలు కూడా ఉండవు. ఇంకా కడుపులో వికారం, అజీర్ణం లాంటి సమస్యలకు ఈ వాము ఆకు మంచి మెడిసిన్ అని చెప్పాలి
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




