Headlines

శక్తివంతమైన ఫీచర్లతో వివో X300e.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ సహా ప్రత్యేకతలివే

శక్తివంతమైన ఫీచర్లతో వివో X300e.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ సహా ప్రత్యేకతలివే


రూ. 69,000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ‘వివో X300e’డివైజ్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 7200mAh భారీ బ్యాటరీతో రూపుదిద్దుకున్న ఈ వివో X300e పూర్తి వివరాలనుతెలుసుకుందాం!

ఆకర్షణీయమైన రంగుల ఎంపిక

వివో సంస్థ తన X300 సిరీస్‌లో ఐదో మోడల్‌గా ‘Vivo X300e’ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేర్వేరు స్టోరేజ్ ఆప్షన్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 4,799 యువాన్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 69,000) కాగా, 12GB RAM, 512GB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర 5,299 యువాన్లు (సుమారు రూ. 75,000)గా ఉంది. మూన్‌లైట్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, సన్‌లైట్ ఆరెంజ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో ఇది లభిస్తుంది. ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయాలు ప్రారంభం కాగా, రాబోయే రోజుల్లో ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

శక్తివంతమైన పనితీరు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 2750 × 1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ సపోర్ట్‌ను అందిస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం 2,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఇవ్వడం విశేషం. అంతేకాకుండా ఏఐ ఐ కంఫర్ట్ ఫీచర్లు, ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను పొందుపరిచారు. తడి వేళ్లతో కూడా ఫోన్‌ను అత్యంత సులభంగా అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం ఉంది.

పనితీరు విషయానికి వస్తే, ఇందులో క్వాల్కమ్ బ్రాండ్‌కు చెందిన లేటెస్ట్ ‘Snapdragon 8 Gen 5’ చిప్‌సెట్‌ను వాడారు. దీనికి LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ తోడుగా నిలవడంతో మల్టీటాస్కింగ్, గేమింగ్ అత్యంత వేగంగా సాగుతాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6 (OriginOS 6) పై రన్ అవుతుంది. రోజంతా నిరంతరం పనిచేసేలా ఇందులో ఏకంగా 7,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రముఖ కెమెరా బ్రాండ్ ‘ZEISS’ సహకారంతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కలిగిన 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, OIS, 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. అలాగే ముందు భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 50MP శాంసంగ్ JN1 సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాలన్నీ అద్భుతమైన 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

వీటితో పాటు స్టీరియో స్పీకర్లు, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, వీసీ కూలింగ్ సిస్టమ్, ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జి, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, అత్యున్నత IP68 & IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న వివో X300e ఫ్లాగ్‌షిప్ మార్కెట్లో తిరుగులేని విజయం సాధించడం ఖాయం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *