Headlines

Goat Brain: మటన్‌ ప్రియులారా బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

Goat Brain: మటన్‌ ప్రియులారా బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..


Goat Brain: మటన్‌ ప్రియులారా బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

నాన్‌వెజ్ ప్రియులలో మటన్ బ్రెయిన్ అదేనండోయ్…మేక మెదడు లేదా భేజా ఫ్రై లేదా కర్రీకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. రుచిలోనే కాకుండా, పోషకాల పరంగా కూడా మేక మెదడులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చాలామంది దీనిని కేవలం ఒక రుచికరమైన వంటకంగానే చూస్తారు. కానీ ఇందులో లభించే విటమిన్లు, మినరల్స్ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మటన్ బ్రెయిన్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

మటన్ బ్రెయిన్‌లో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి:

నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని, మెదడు కణాల నిర్మాణాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఐరన్, ప్రోటీన్ తదితర పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలం. ఒమేగా 3 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒమేగా 3 రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. కాబట్టి హృద్రోగులకు ఇది మంచిదే. రక్తకణాల ఉత్పత్తికి, నాడీ మండల పనితీరుకు ఇది చాలా అవసరం. నాడీ వ్యవస్థ పనీతీరు మెరుగుపరుస్తుంది. దీనిలోని ప్రోటీన్లు, ఐరన్ కండరాల నిర్మాణానికి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి తోడ్పడతాయి. ఫాస్ఫరస్, జింక్ వంటివి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:

మటన్ బ్రెయిన్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, కొలీన్ మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇక రుచి విషయానికి వస్తే.. ఇది కాస్త మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. భలే టేస్టీగా ఉంటుంది. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ B12 నరాల బలహీనతను నివారిస్తుంది. నాడీ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్, విటమిన్ B12 లోపం ఉన్నవారికి మేక మెదడు మంచి ఆహారం. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల (RBC) ఉత్పత్తిని పెంచి అనీమియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉత్తమ రకం ప్రోటీన్ ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, కండరాల క్షీణతను తగ్గిస్తుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

మేక మెదడులో ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, దీనిలో శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ పరిమాణం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనిని పరిమితంగా లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అధిక బరువు, బీపీ, డయాబెటిస్ ఉన్నవారు.. దీనికి దూరంగా ఉండటమే బెటర్. నెలలో కేవలం రెండు సార్లు మాత్రమే తినండి. అతిగా తింటే కొత్త సమస్యలు వస్తాయి. సరైన మోతాదులో, ఆరోగ్యకరమైన పద్ధతిలో ఉడికించి తీసుకుంటే మటన్ బ్రెయిన్ మీ ఆహారంలో మంచి పోషక విలువలను జోడిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *