డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కొరియన్ హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కాన్సెప్ట్‌లు, ఊహించని ట్విస్టులు, భయానక వాతావరణంతో ప్రేక్షకాభిమానులను అలరించడంలో కొరియన్ మేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి ఒక సెన్సేషనల్ కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టి రచ్చ లేపుతోంది. అదే ‘ఘోస్ట్ ట్రైన్’ (Ghost Train). ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తెగ సెన్సేషన్ అవుతుంది.
ఈ సినిమా కథంతా ఒక యూట్యూబర్ చుట్టూ తిరుగుతుంది. యూట్యూబ్‌లో హారర్, సూపర్ నేచురల్ కాన్సెప్ట్లపై వీడియోలు చేసే సదరు యూట్యూబర్‌కు వ్యూస్, సబ్స్క్రైబర్లు అనుకున్న స్థాయిలో రారు. దాంతో ఎలాగైనా తన ఛానెల్‌ను హిట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక భయానకమైన రూమర్స్ ప్రచారంలో ఉన్న పాడుబడిన రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్ ఆమెకు ఆ స్టేషన్లో జరిగిన కొన్ని వింతలు, భయంకరమైన సంఘటనల గురించి నాలుగు వేర్వేరు కథలను వివరిస్తాడు. ఆ కథలు విన్న తర్వాత, ఆమెకు అక్కడ ఊహించని భయానక అనుభవాలు ఎదురవుతాయి.
కేవలం వ్యూస్ కోసం వెళ్లిన ఆమె, స్వయంగా ఆ ‘ఘోస్ట్ ట్రైన్’ మాయాజాలంలో ఎలా చిక్కుకుంది? ఆ మిస్టరీ స్టేషన్ నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా? అనేదే ఈ సినిమా కథ. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ కొరియన్ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ భాషతో పాటు తెలుగు, హిందీ, తమిళం , ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ చిత్రం లభిస్తుండడం మన ప్రేక్షకులకైతే ప్లస్ పాయింట్. ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తారు.
సుమారు గంటన్నర నిడివి ఉండే ఈ సినిమా, మొదటి నిమిషం నుంచి చివరి వరకు రన్-టైమ్‌లో ఎక్కడా బోర్ కొట్టకుండా హై-నెయిల్ బైటింగ్ థ్రిల్‌ను అందిస్తుంది. గుండె ధైర్యం ఉండి, మైండ్ బ్లోయింగ్ హారర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారు ఈ వీకెండ్లో ప్రైమ్ వీడియోలో ‘ఘోస్ట్ ట్రైన్’ ను తప్పకుండా చూడొచ్చు. కొరియన్ ప్రేమ కథలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రూటు మార్చి ఈ హారర్ థ్రిల్లర్ సైతం వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతుంది.
ఈ సినిమాలో అడుగడుగునా ట్విస్టులు.. వెన్నులో వణుకుపుట్టించే సీన్స్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆద్యంతం ఈ సినిమా మరింత ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు కలగసిన ఈ మూవీని ఇప్పుడు మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. ఘోస్ట్ ట్రైన్.. హారర్ మూవీ లవర్స్ కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరిన్ని సినిమాలు అందుబాటులో ఉన్నాయి.




