Headlines

Aadarsa Kutumbam: ఆదర్శ కుటుంబం ఫస్ట్ అప్‌డేట్‌.. చిట్టి బాబుగా మారిన సినరాజు ఆకట్టుకున్నాడా?

Aadarsa Kutumbam: ఆదర్శ కుటుంబం ఫస్ట్ అప్‌డేట్‌.. చిట్టి బాబుగా మారిన సినరాజు ఆకట్టుకున్నాడా?


సినిమా మొదలై చాలా రోజులైపోయింది.. షూటింగ్ జరుగుతుందంటున్నారు.. మరేంటబ్బా గురూజీ కనీసం ఒక్క పోస్టర్ మినహా మిగిలిన అప్‌డేట్స్ ఏమీ ఇవ్వలేదు.. అసలు ఆదర్శ కుటుంబం ఆన్ టైమ్ వస్తుందా రాదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. వాటన్నింటికీ తెరదించుతూ.. కాస్త లేటైనా లేటెస్టుగా తన మార్క్ ప్రమోషన్ షురూ చేసారు మాటల మాంత్రికుడు. మరి అదేంటో చూద్దామా..? చూస్తున్నారుగా.. ఆదర్శ కుటుంబంలో వెంకీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక్క టీజర్‌తోనే క్లారిటీ ఇచ్చారు త్రివిక్రమ్. ఎలాంటి ప్రయోగాలు చేయట్లేదు.. రిస్కులు తీసుకోవట్లేదు.. హాయిగా వెంకీ ఇమేజ్‌ను క్యారీ చేస్తూ మంచి ఫ్యామిలీ సినిమా చేస్తున్నానని టీజర్‌తోనే చెప్పేసారు. పైగా కామెడీకి ఢోకా ఉండదని ఇంట్రోతో క్లారిటీ వచ్చేసింది. వింటేజ్ వైబ్స్‌తోనే ఆదర్శ కుటుంబం సిద్ధమవుతుంది. వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. వాళ్ల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆదర్శ కుటుంబంలో అన్నీ ఉండేలా చూసుకుంటున్నారు గురూజీ. వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి.. మరో కీలక పాత్రలో నారా రోహిత్ నటిస్తున్నారు. అనిల్ రావిపూడి తరహాలోనే ఫ్యామిలీ మీల్స్ సిద్ధం చేస్తున్నారు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం ప్రమోషన్ కూడా డిఫెరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ముందుగా ఇందులో వెంకీ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను పరిచయం చేసారు. ఇంకా ఈ ప్రపంచంలోని శ్రీనిధి పోషిస్తున్న స్వర్ణ.. పిల్లలు సంపూర్ణ, శర్వా పాత్రలు కూడా వరసరగా పరిచయం చేయబోతున్నారు. నారా రోహిత్ పాత్ర కూడా ఉంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. మొత్తానికి గురూజీ ప్రమోషన్స్ మొదలైపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *