Headlines

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!


కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. ‘ప్రశాంతంగా కాపురం చేసుకుందాం రా’ అని నమ్మించి పిలిపించి, వచ్చిన రోజే ఆమెను నూరేళ్ల జీవితాన్ని దారుణంగా ముగించేసాడు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు జిగలూరు భాగ్యశ్రీ మనస్పర్ధల కారణంగా కొద్దిరోజులుగా పుట్టింట్లోనే ఉంటోంది. భర్త ప్రవీణ్ అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం రమ్మని భార్యను నమ్మబలికి సోమవారం ఇంటికి తెచ్చాడు. అయితే, రాత్రి కాగానే అతని నిజస్వరూపం బయటపెట్టాడు. ఆమెపై కర్రతో దాడి చేసి, దుపట్టాతో ఉరివేసి అత్యంత క్రూరంగా చంపేశాడు. అంతటితో ఆ రాక్షసత్వం ఆగలేదు. భార్య ఊపిరాడక ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న ఆ నరకయాతనను ఫోన్‌లో చిత్రీకరించాడు. కన్నతల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, తమ కూతురు కళ్లముందే విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపించి పైశాచిక ఆనందం పొందాడు. ఆ ఘోర దృశ్యాలను బంధువులకు, స్నేహితులకు కూడా పంపాడు. కాపురానికి వెళ్లిన కూతురు గంటల వ్యవధిలోనే శవమై తేలడంతో, ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏసీ కోచ్‌లో నూనె దీపంతో పూజలు.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *