Headlines

హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!

హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!


ఉదయాన్నే ఆరోగ్యకరమైన, ప్రొటీన్లు సమృద్ధిగా లభించే అల్పాహారం కోసం శనగ-పెసర చిలా అద్భుతమైన ఎంపిక. రాత్రంతా నానబెట్టిన నల్ల శనగలు, పొట్టు పెసళ్లతో తయారుచేసే ఈ చిలాలో పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందించడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. సులభంగా, తక్కువ సమయంలో ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఈ పౌష్టికాహార వంటకం జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దీనిని పుదీనా చట్నీ లేదా పెరుగుతో తీసుకుంటే రుచితో పాటు పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. హై ప్రొటీన్ శనగ-పెసర చిలా తయారీకి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

నానబెట్టిన పొట్టు పెసళ్లు: 1 కప్పు

నానబెట్టిన నల్ల శనగలు: 1/2 కప్పు

ఇవి కూడా చదవండి



పచ్చిమిర్చి: 2

అల్లం: చిన్న ముక్క

జీలకర్ర: 1 టీస్పూన్

ఇంగువ: చిటికెడు

ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర: సన్నగా తరిగినవి

ఉప్పు, నూనె/నెయ్యి: తగినంత

తయారుచేసే విధానం:

రాత్రంతా నానబెట్టిన పెసళ్లు, శనగలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా నీరు చేర్చి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడెక్కాక కొద్దిగా నూనె రాయాలి. సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా పలచగా పరుచుకోవాలి. చిలా అంచులెంబడి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా కాలే వరకు వేయించాలి.

శనగ-పెసర చిలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

అధిక ప్రొటీన్, పీచుపదార్థం: పెసళ్లు, శనగలలో లభించే వెజిటేరియన్ ప్రొటీన్ కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలిగి, త్వరగా ఆకలి వేయదు.

బరువు తగ్గడానికి ఉపయోగకరం: తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన డైట్ ఫుడ్.

షుగర్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించడంలో ఈ దోశ బాగా తోడ్పడుతుంది.

ఈ పౌష్టికాహార శనగ-పెసర చిలాను వేడివేడిగా అల్లం చట్నీ, పుదీనా చట్నీ లేదా తాజా పెరుగుతో ఆస్వాదించవచ్చు. రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించడానికి ఇది మీకు బెస్ట్‌ అప్షన్‌.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *