మీ ఇంట్లో ఉండే వాటితోనే మొండి తామర, దురదనును ఈజీగా తగ్గించుకోవచ్చు. పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఏంటా అని సందేహిస్తున్నారా ? మరి అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
వేపాకులో ఉండే సహజ గుణాలు చర్మాన్ని మంచిగా ఉంచుతాయి ఇంకా పసుపులో ఉండే కర్కుమిన్ చర్మ సంరక్షణగా పనిచేస్తుంది , కొబ్బరి నూనె చర్మాన్నిఅన్ని వేళలా తడిగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అందు వలన ఈ మూడింటిని కలిపి తీసుకుంటే మొండి తామర, దురద తగ్గుతుంది. ఇది పల్లెటూర్లలో పాటిస్తుంటారు.
ఈ పొడి తయారీ విధానం : ముందుగా మీరు తాజా ఉండే వేపాకులను బాగా కడిగి ఎండబెట్టాలి ఆ తర్వాత మీరు దీనిని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దీ సేపటి తరవాత అర టీ స్పూన్ పసుపు కూడా వేసి కలపాలి. ఆ తరవాత దీనిలో కొంచం నూనె వేసి మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి
ఈ పొడిని ఎలా అప్లై చేయాలంటే? ముందుగా ఆ ప్రాంతాన్ని మంచిగా శుభ్రం చేసి పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత మీరు సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్‌ను మరి ఎక్కువగా రాయకుండా కొంచం రాసి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత దీనిని గోరువెచ్చని నీటితో కడిగి మంచిగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతోంది
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




