Headlines

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!


ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీపి కబురు అందించింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బుక్ చేసిన కేవలం 4 గంటల్లోనే 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారుల ఇంటికి డెలివరీ చేయనుంది. సాధారణ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ బరువు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మోయడం, తరలించడం ఎంతో సులభమవుతుంది. గృహ అవసరాలతో పాటు చిన్న తరహా వ్యాపారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులు తమకు అనుకూలమైన డెలివరీ సమయాన్ని ఎంచుకునే వెసులుబాటుతో పాటు డిజిటల్ విధానంలో వేగంగా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీ సేవలను పుణే, గురుగ్రామ్, ఇండోర్, కోయంబత్తూరు నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల స్పందనను బట్టి త్వరలోనే దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. అంతేకాకుండా, విద్యార్థులు, చిన్న కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 5 కిలోల ‘ఇండేన్ ఛోటూ’ సిలిండర్‌కు కూడా ఈ 4 గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను వర్తింపజేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!

భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *