Headlines

Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్

Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్


ఫ్యామిలీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, కామెడీ అంటూ వరుస జోనర్స్‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న శర్వానంద్.. ఈసారి మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నారా..? సంపత్ నంది, శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లతో పని చేస్తున్న ఈ హీరో.. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు ఓకే చెప్పారా..? ఈ మధ్యే ఓ పెద్ద సినిమా చేసిన దర్శకుడితో విజువల్ వండర్ చేయబోతున్నారా..? అసలు శర్వా చేయబోయే ఆ సినిమా ఏంటి..? నారినారి నడుమ మురారి తర్వాత మళ్లీ బిజీ అయిపోయారు శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియడ్ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు.. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నపుడే శ్రీను వైట్లతో మరో సినిమాను ఓకే చేసి పట్టాలెక్కించారు. భోగి ఆగస్ట్ 28న వస్తుంటే.. శ్రీను వైట్ల సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండింటి షూట్స్ వేగంగా జరుగుతున్నాయి. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి కాకముందే అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ మధ్యే నాగబంధంతో వచ్చారు నామా. ఈ సినిమా నిరాశపరిచినా విజువల్ పరంగా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతమైన VFX మ్యాజిక్ క్రియేట్ చేయడంలో అభిషేక్ నామా సక్సెస్ అయ్యారు. ఈ నమ్మకంతోనే అభిషేక్ నామా చెప్పిన మైథలాజికల్ సబ్జెక్ట్‌కు శర్వానంద్ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతుంది. నాగబంధం సినిమాతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకాస్త భారీ బడ్జెట్‌తో పాటు హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో తెరపైకి రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *