IPL brand valuation 2026: అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లాక్ విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాపార విలువ తొలిసారిగా సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, ఈ అధ్యయనం ప్రకారం, గత రెండు ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్రాండ్ విలువ కూడా 300 మిలియన్లను దాటింది.