Headlines

Kuja Gochar 2026: కుజుడితో వారికి నానా తంటాలు.. ఆర్థిక సమస్యలకు ఛాన్స్..!

Kuja Gochar 2026: కుజుడితో వారికి నానా తంటాలు.. ఆర్థిక సమస్యలకు ఛాన్స్..!


ప్రమాదకర గ్రహాల్లో కుజ గ్రహం కూడా ఒకటి. హఠాత్తుగా ఏదో ఒక ప్రమాదాన్ని కలిగించి జీవితాన్ని అతలాకుతలం చేయడంలో కుజుడి తర్వాతే ఏ గ్రహమైనా.. ప్రమాదాలకు, విద్యుదాఘాతలకు, కింద పడడానికి, శస్త్రచికిత్సలకు, వివాదాలకు, తగాదాలకు, వాదోపవాదాలకు, ఆయుధాలకు కారకుడైన కుజుడితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం ఈ కుజుడు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు ఈ నెలన్నర జీవితాన్ని సురక్షితంగా, సుఖప్రదంగా గడపాలన్న పక్షంలో ప్రతి రోజూ స్కంద స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.

వృషభం

ఈ రాశికి ద్వితీయ స్థానంలో, అంటే వాక్కు, ధనం, కుటుంబానికి సంబంధించిన స్థానంలో కుజ సంచారం వల్ల తగాదాలకు, వాదోపవాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లోకి, తగాదాల్లోకి తలదూర్చి దెబ్బతినే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో టెన్షన్లు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. మీ సలహాలు, సూచనలు ఎవరికీ రుచించకపోవచ్చు. ఆర్థిక నష్టం జరిగే అవకాశం బాగా ఉంది.

మిథునం

ఈ రాశిలో కుజ సంచారం వల్ల వాహన ప్రమాదాలకు, రోడ్డు ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు బాగా అవకాశం ఉంది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బీపీ వంటి రక్త సంబంధమైన సమస్యలు ఎక్కువయ్యే సూచనలున్నాయి. ఇతరుల వివాదాల్లో, తగాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. శరీరానికి గాయాలు కావచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి



కర్కాటకం

ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడి సంచారం వల్ల వివాదాలు, వాదోపవాదాలు పేట్రేగుతాయి. ఇంటా బయటా మాత్రమే కాక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అకారణ విభేదాలు తలెత్తే అవ కాశం ఉంది. అనారోగ్యాలకు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి శస్త్ర చికిత్సలు అవసరం కావచ్చు. అనవసర ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా ఇబ్బంది పెడతాయి. పిల్లల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు ఏర్పడ తాయి.

కన్య

తృతీయ, అష్టమ స్థానాల అధిపతిగా ఈ రాశికి అత్యంత పాపి అయిన కుజుడు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉన్నతాధికారులు, యాజమాన్యాలతో వివాదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రాంతానికి బదిలీ కావడం, తప్పనిసరిగా ఉద్యోగం మారడం వంటివి జరగవచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కోర్టు కేసులకు కూడా అవకాశం ఉంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలున్నాయి.

వృశ్చికం

రాశ్యధిపతి కుజుడు అష్టమ స్థాన సంచారం వల్ల ఈ రాశివారికి జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రులతో చికాకులు కలుగుతాయి. కొందరు సన్నిహితులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతోనూ, సహోద్యోగులతోనూ మాట పట్టింపులు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురు కావచ్చు. ఆదాయం తగ్గుతుంది.

ధనుస్సు

ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడడం గానీ, కొద్ది కాలం పాటు దూరం కావడం గానీ జరుగుతుంది. దాంపత్య జీవితం అసంతృప్తిగా మారుతుంది. ఇతరుల తగాదాల్లో తలదూర్చి ఇబ్బందులు పడతారు. ఆస్తి తగాదాలకు, కోర్టు కేసులకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.

మీనం

ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో టెన్షన్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగి స్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా కలుగుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతుంది.. గృహ, వాహన ప్రయత్నాలు స్తంభించిపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది.

Also Read: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

(గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలు సంప్రదాయ జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కావు. వీటిని కేవలం సాధారణ సమాచారం, ఆధ్యాత్మిక ఆసక్తి కోసం మాత్రమే పరిగణించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *